వసంత పంచమి మహోత్సవం కోసం ముస్తాబైన వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం విద్యుత్ దివ్వెల వరుసలతో కాంతులీనుతున్నది. గురువారం పర్వదినం పురస్కరించుకుని క్షేత్రాన్ని విద్యుత్ దీపాల వరుసలతో తీర్చిదిద్దారు. అక్షరాభ్యాస మండపం వద్ద విద్యుత్ దీపాలను అమ్మవారి వివిధ అలంకారాల రూపంలో అమర్చారు. క్షేత్రాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవ శోభను నింపారు.
రేపు వసంత పంచమి మహోత్సవం